పాకిస్థాన్‌కు ప్రజాస్వామ్యం సరిపడదు: ముషారఫ్

democracy-has-not-been-suited-to-pakistan-pervez-musharraf

పాకిస్థాన్‌లోని పరిస్థితులకు ప్రజాస్వామ్యం సరిపడదని ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాక్‌లో ఆర్మీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పిన ఆయన.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తమ పాత్రను సరిగా నిర్వహించలేకపోవడం వల్లే ఆర్మీ కీలకంగా మారిందన్నారు. వాషింగ్టన్ ఐడియాస్ ఫోరం ఇంటర్వ్యూలో మాట్లాడిన ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యం లేదని, ఇది పాకిస్థాన్ వారసత్వ బలహీనత అన్నారు. కాబట్టే ప్రభుత్వ వ్యవహారాల్లో సైన్యం జోక్యం చేసుకుంటోందని ముషారఫ్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు పెడదోవ పట్టినప్పుడు, ఆర్థిక, సామాజిక సూచికలు పాతాళానికి పడిపోతున్నప్పుడు సైన్యం ఇలా చేయాల్సి వస్తోందన్నారు. పాక్‌లో మిలటరీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి కారణమిదే అని ముషారఫ్ చెప్పుకొచ్చారు. పాక్ ప్రజలు కూడా ఆర్మీని ఎంతో ప్రేమిస్తారన్నారు. నేను ఆర్మీతో 40 ఏళ్లుకుపైగా సంబంధాలున్నాయి. నేను యుద్ధాల్లో పాల్గొన్నాను. అందుకే ఆర్మీ నాకు మద్దతుగా నిలిచిందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా తన స్వలాభాల కోసం పాక్‌ను ఇష్టం వచ్చినట్లు వాడుకొని వదిలేసిందని ఆయన విమర్శించారు. పాక్‌కు తిరిగి వెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లు చెప్పిన ఆయన.. పాక్ ప్రభుత్వం సరిగా పని చేస్తే నేను తిరిగి స్వదేశానికి వెళ్లనన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*