అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేదేమీ లేదు… దివాకర్ రెడ్డి

టీడీపీ ఎంపీలు బుధవారం నాడు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం విప్ జారీ చేసినా సరే పార్లమెంట్ సమావేశాలకు పోనంటే పోను అని తేల్చి చెప్పేశారు.పూర్తి పార్లమెంట్ సమావేశాలకే హాజరుకాబోనని జేసీ తేల్చిచెప్పేశారు. అటు కేంద్రం.. ఇటు రాష్ట్రంలో రాజకీయాలు సరిగ్గాలేవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ అవిశ్వాసం వల్ల ఒరిగేదేమీలేదని.. దీనివల్ల కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆయన కుండ బద్దలు కొట్టారు.,అవిశ్వాసం వల్ల సచ్చేది లేదు.. బతికేది లేదు.. ఇదంతా ప్రజలకు తెలియజేయడానికే తప్ప మేం సాధించిందేమీ లేదన్నారు. ఒకరిద్దరికి సభలో మాట్లాడే అవకాశం వస్తుందంతే.. మా వాళ్లు మాట్లాడి సమాధానం చెప్తారంతేనన్నారు. ఈ విషయంపై ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడిన అవసరం కూడా లేదని ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు. తాను వెళ్లినా.. వెళ్లకపోయినా పెద్ద ప్రమాదమేమీ లేదన్నారు. అయితే ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి చూస్తే సొంత పార్టీలోని ఎంపీనే షాకివ్వడంతో ఇక మిగతా పార్టీల ఎంపీల ఎంత మాత్రం మద్దతిస్తారో వెయిట్ చేయాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*