డీజే వినోదం!

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డిజె దువ్వాడ జగన్నాథమ్. హరీష్‌శంకర్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లు అర్జున్ బ్రహ్మణ యువకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన లభిస్తున్నది. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో అల్లు అర్జున్‌ని ఆవిష్కరించే చిత్రమిది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర చిత్రణ, లుక్ కొత్తగా వుంటాయి.

ఇటీవలే అబుదాబిలో కొంత భాగం చిత్రీకరణ పూర్తిచేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. శ్రీమణి రాసిన పాటను దినేష్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నాం. సినిమాలోని ప్రధాన హైలైట్‌లలో ఈ పాట ఓ హైలైట్‌గా నిలుస్తుంది. బన్నీ డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై చిత్రీకరిస్తున్న ఈ పాట బన్నీ అభిమానులకు కనుల విందుగా వుంటుంది అన్నారు ఈ చిత్రానికి కెమెరా: ఐనాకబోస్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్.ఎస్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*