జయ కోసం చైన్నైకి వచ్చిన లండన్ వైద్యులు

doctor-from-uk-called-to-examine-jayalalithaa-at-apollo-hospitals

గత పది రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం జయలలితను పరీక్షించేందుకు గాను విదేశీ వైద్యులు చెన్నైకి చేరుకున్నారు. లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు రిచర్డ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. లండన్‌లోని బ్రిడ్జి ఆసుపత్రికి చెందిన రిచర్డ్ జాన్ బీలే జయలలిత ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. ఆపోలో ఆసుపత్రిలోని వైద్యుల బృందానికి మరో రెండు రోజుల పాటు ఆయన అందుబాటులో ఉంటారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ధ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అపోలో ఆసుపత్రి పరిధిలో సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులు మెహరించారు. గత రెండు రోజులుగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ను అపోలో వైద్య బృందం విడుదల చేయకపోవడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, జయ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*