గెలిచేది హిల్లరీయే

 

donald-trump-hillary-clinton-prediction-mulugu-ramalingeswa

మరో నెల రోజుల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలవనున్నారని శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ జోస్యం చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్‌‌కు జాతక ప్రకారం ఇప్పుడు ఏలిననాటి శని నడుస్తోందని, మిగతా గ్రహాల గమనం సైతం విజయాన్ని సూచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్, హిల్లరీల జాతక చక్రాలను రూపొందించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జ్యేష్టా నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశిలో ట్రంప్ జన్మించారని, ఆయన జన్మలగ్నం సింహమని, పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన హిల్లరీది కుంభరాశి, జన్మలగ్నం తులా లగ్నమని చెప్పుకొచ్చారు. ఆమెకు ప్రస్తుతం రవి మహర్దశలో రాహువు అంతర్దశ నడుస్తోందని అన్నారు. రవి నీచభంగ రాజయోగంలో, రాహువు ఉచ్చస్థితిలో, దశమ స్థానంలో శని, కుజులున్నారని, ఇది రాజకీయ విజయం దిశగా అత్యంత కీలకమని అన్నారు. అంతేగాక, హిల్లరీ జాతకాన్ని పరిశీలిస్తే అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఖాయంగా తెలుస్తోందని వివరించారు. తొలిసారిగా ఒక మహిళ అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యే పరిస్థితి కూడా ఉందని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*