షారుఖ్, జూహీలకు ఈడీ నోటీసులు

ముంబై: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహయజమాని షారుఖ్ ఖాన్‌తో పాటు అతని భా ర్య గౌరీఖాన్, సహనటి జూహీచావ్లాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆదేశిం చింది. బెర్ముడాకు చెందిన రెడ్ చిల్లీస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఆర్‌సీఐఎల్)కు షారుఖ్, గౌరీ సహయజమానులు.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఫ్రాంచైజీ హక్కులన్నీ ఆర్‌సీఐఎల్‌కే ఉ న్నాయి. మొదట కేఆర్‌ఎస్‌పీఎల్‌లోని షే ర్లన్నీ రెడ్‌చిల్లీస్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు గౌరీ పేరిట ఉండేవి. అయితే ఐపీఎల్ సక్సెసవడంతో కేఆర్‌ఎస్‌పీఎల్ అదనం గా 2కోట్ల షేర్లను ఇష్యూ చేసింది. ఇందు లో మారిషస్‌కు చెందిన ఐస్‌ల్యాం డ్ ఇ న్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌కు 50 లక్షల షేర్లు, జూహీచావ్లాకు 40 లక్షల షేర్లు కేటాయించింది. వాస్తవ ధర (రూ. 86-99) కంటే అతితక్కువగా రూ. 10 లకే షేర్లు విక్రయించింది. ఇలా ఫెమా నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా రూ. 73.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు విచారణ లో తేలడంతో నోటీసులు ఇచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*