ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..
అందుకే ఆలస్యం విజువల్ అడ్వెంచర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జేమ్స్ కెమెరూన్ ఇప్పుడు మరొక మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ పార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అసలయితే 2014లోనే ఈ సినిమా రావాల్సింది. కానీ మరొక మూడు సీక్వెల్స్ ను ప్రకటించడంతో సరికొత్త టెక్నాలజీతో అవతార్ ను రూపొందించారు. కరోనా కారణంగా కూడా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమైంది.