సరికొత్త కాన్సెప్టులతో వచ్చే సినిమాలను దక్షిణాది ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారన్న విషయం తెలిసింది. ఇది ‘కాంతార’తో మరోసారి నిరూపణ అయింది. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొందిన ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అంతేకాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తెలుగులో డబ్బింగ్ అయిన ‘కాంతార’ పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కేవలం 17 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ మూవీ 17 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!
కన్నడ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే ‘కాంతార’. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించారు. అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందించారు. ఇది తెలుగులో కాస్త ఆలస్యంగా అంటే అక్టోబర్ 15న విడుదలైంది.