టాలీవుడ్‌లోకి బ్యాగ్రౌండ్‌తో వచ్చినా కెరీర్ ఆరంభంలోనే తనలోని టాలెంట్లను నిరూపించుకుని.. దాదాపు నలభై ఏళ్లుగా స్టార్‌గా సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అంతేకాదు, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇలంటి పరిస్థితుల్లో గత ఏడాది ‘అఖండ’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి తాజాగా భారీ ఆఫర్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!
గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ చాలా కాలం పాటు విజయాలను సొంతం చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గత ఏడాది వచ్చిన ‘అఖండ’ మూవీతో మరోసారి విజయాల బాటలోకి వచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో బాలయ్య కెరీర్‌లోనే దీనికి అత్యధిక వసూళ్లు రావడంతో బిగ్ హిట్ అయింది.
వీరసింహారెడ్డిగా బాలయ్య నటసింహా బాలకృష్ణ ‘అఖండ’ తర్వాత మరింత ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగానే ‘క్రాక్’ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై అప్పుడే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.