నకిలీ కాల్‌సెంటర్ రాకెట్ గుట్టురట్టు

fake-call-centre-racket-busted

మహారాష్ట్రలోని థానేలో భారీ నకిలీ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టైంది. ఈ నకిలీ కాల్ సెంటర్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. కాగా, థానెలోని మీరారోడ్డులోని మూడు కాల్‌సెంటర్ల ద్వారా భారీ స్కాం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 700మంది కాల్ సెంటర్ల ఉద్యోగులను పోలీసులు చుట్టిముట్టి విచారిస్తున్నారు. కాల్ సెంటర్ కుంభకోణంలో 70 మంది వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రో 630 మంది ఉద్యోగుల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే హ‌రి ఓమ్ ఐటీపార్క్‌, యూనివ‌ర్స‌ల్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌, ఓస్వాల్ హౌజ్ అనే ఈ కాల్‌సెంట‌ర్ల య‌జ‌మానులు మాత్రం ప‌రారీలో ఉన్నారు. రూ. 500 కోట్లు కాగా, ఈ కుంభకోణంలో విచార‌ణ జ‌రిగే కొద్దీ ఇంకా పెద్ద మొత్తం బ‌య‌ట‌పడే అవ‌కాశం ఉందని థానె పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్‌బీర్ సింగ్ వెల్ల‌డించారు. ఈ కాల్ సెంట‌ర్ కుంభ‌కోణం వివ‌రాల‌ను అటు అమెరికా ఫెడ‌ర‌ల్ అధికారులు కూడా తీసుకున్నారు. అమెరికాలో ఉంటూ ఈ కాల్‌సెంట‌ర్ల‌కు బాధితుల ఫోన్ నంబ‌ర్లు చేర‌వేసిన వ్య‌క్తుల వివ‌రాల‌ను అమెరికా ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు సేక‌రిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*