అగ్నిప్రమాదంతో కూలిన ఫ్లైఓవర్‌

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని 85వ అంతరాష్ట్ర రహదారి ఫ్లైఓవర్‌పై ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించడంతో వంతెన కూలిపోయింది. సమాచారమందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

పైడ్‌మాంట్‌ రోడ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు గంటకు పైగా వంతెనపై మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. అట్లాంటా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. అయితే కాసేపటికే వంతెన కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ రహదారిని మూసివేసి ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.

ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు తొలుత అనుమానాలు వ్యక్తమైనా.. వాటిలో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఫ్లైఓవర్‌ కింద ఉన్న ప్లాస్టిక్‌ పైపులు అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*