అమెజాన్‌ను దాటేసిన ఫ్లిప్‌కార్ట్

flipkart-claims-to-sell-more-units-than-amazon-india-in-first-12-hours

దసరా, దీపావళి పండగల సందర్భంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు పోటాపోటీగా ఆఫర్ సేల్స్‌ను ప్రారంభించాయి. అమెజాన్ అక్టోబర్ 1 నుంచి తన ‘గ్రేట్ ఇండియన్ సేల్‌’ను ప్రారంభించగా.. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 2 నుంచి ‘బిగ్ బిలియన్ డే’ పేరిట ఆఫర్ సేల్ మొదలుపెట్టింది. మరో దేశీ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ కూడా అక్టోబర్ 2 నుంచి 6 వరకు ‘అన్‌బాక్స్ దివాళీ సేల్’ పేరిట ఆఫర్స్ అందిస్తోంది. ఈ అమ్మకాలకు వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.మార్కెట్ లీడర్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆఫర్ సేల్ పోటీలో ముందున్నాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మకాల్లో మాత్రం ఫ్లిప్‌కార్ట్ పైచేయి సాధించింది. అక్టోబర్ 2న అమ్మకాలు ప్రారంభించిన 12 గంటల్లోనే అమెజాన్ కంటే ఎక్కువ యూనిట్లను ఫ్లిప్‌కార్ట్ విక్రయించింది. బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన 12 గంటల్లో ఫ్లిప్‌కార్ట్, మైంత్రా కలసి 2.25 మిలియన్ యూనిట్లను విక్రయించినట్లు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అక్టోబర్ 1న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించిన అమెజాన్ తొలి 12 గంటల్లో 1.5 మిలియన్ యూనిట్లను విక్రయించింది. అయితే మొదటి 12 గంటల్లో 1.2 మిలియన్ యూనిట్లు అమ్మినట్లు ఫ్లిప్‌కార్ట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. కానీ సంస్థ అధికార ప్రతినిధి మాత్రం ఆ సంఖ్యను 8 గంటల్లోనే చేరుకున్నామని వెల్లడించారు. మొత్తం మీద ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కలసి సేల్స్ ప్రారంభమైన 12 గంటల్లో 3.73 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువే విక్రయించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*