ఆమీర్ బర్త్ డే పార్టీలో ఫోగట్ ఫ్యామిలీ

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం దంగల్. మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ రోజు అమీర్ ఖాన్ తన 52వ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఈ పార్టీకి బాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తుండగా, ఫోగట్ ఫ్యామిలీ ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆమీర్ ఫోగట్ ఫ్యామిలీకి ఇన్విటేషన్ పంపగా, బబిత ఆమె సోదరి గీతాతో పాటు వారి తండ్రి మహవీర్ ఫోగట్ కూడా బర్త్ డే కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. మరి అమీర్ సెలబ్రిటీల సమక్షంలో తన బర్త్ డేని ఎంత గ్రాండ్ జరుపుకుంటాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*