ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మాజీ ప్రధాని దేవెగౌడ

former-pm-deve-gowda-goes-on-indefinite-hunger-strike-outside-vidhana

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జల వివాదం ముదురుతుంది. తమిళనాడుకు నీరు విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కర్మాటక రాజధాని బెంగుళూరులోని విధానసౌధ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆయన శనివారం ఉదయం ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కావేరీ జలాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కావేరీలో నీళ్లు లేవని చెప్పిన ఆయన తమిళనాడుకు ఒక్క చుక్క కూడా నీళ్లు ఇవ్వలేమన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసినా సుప్రీం కోర్టు తమిళనాడుకి నీళ్లు ఇవ్వాల్సిందేనంటూ తీర్పు ఇవ్వడంతోనే తాను దీక్షకు దిగినట్లు ఆయన చెప్పారు. తాగడానికి నీళ్లు లేకపోతే ప్రతిరోజూ వేల సంఖ్యలో నీళ్లు వదలానని అంటున్నారని అన్నారు.  సుప్రీం కోర్టులో మాకు న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష విరమించేది లేదన్నారు. శనివారం ఉదయం పద్మనాభ నగర్‌లోని తన ఇంటికి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన దేవగౌడ్ అనతంరం విధానసౌధకు చేరుకుని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇదిలా ఉంటే ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మిళ‌నాడుకు కావేరీ జ‌లాల‌ను వ‌దిలేది లేద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా నిర్ణ‌యించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో శనివారం మధ్యాహ్నాం అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు హాజరుకానున్నారు. సుప్రీం తీర్పుని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయాలా? లేదా అనే విషయంలో ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు కర్ణాటకను ఆదేశించింది. తమ తీర్పును అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారంలోగా కావేరీ యాజనమ్యా బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని నిర్దేశించింది. బోర్డు సభ్యులను నామినేట్‌ చేయాలని తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్రంలో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలో మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ కూడా సుప్రీం తీర్పుకు వ్య‌తిరేకంగా ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*