నేటి నుంచి పది పరీక్షలు

పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 29 వరకు జరగనున్న పరీక్షల కోసం విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నాం 12:15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,17,484 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో
3,11,008 మంది బాలురు, 2,95,359 మంది బాలికలు ఉన్నారు. మరో 9,294 మంది సప్లిమెంటరీ విద్యార్ధులు కూడా పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యప్తంగా 2,834 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్నంత సేపు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.  ప్రతి జిల్లాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌లను ఏర్పాటు చేశారు. నగరాల్లో విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకుగాను సెంటర్‌ లోకేషన్‌ యాప్‌ను రూపొందిచారు. అలాగే విద్యార్దులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 18005994550 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*