పదికి పకడ్బందీగా ఏర్పాట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు

పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారని, 2,834 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల గుర్తింపునకు లోకేషన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలపై దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్ష రాయడానికి వీల్లేదని, అవసరమయితే ఫర్నిచర్‌ను అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 0866-2974450, 0866-2974550 నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్‌ రూం, టోల్‌ ఫ్రీనెంబర్‌ ఏర్పాటు చేశామన్నారు. హాల్‌ టికెట్‌ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చన్నారు. ఫీజు బకాయిల పేరుతో ప్రైవేట్‌ పాఠశాలలు హాల్‌ టికెట్లు నిలిపివేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*