ముమ్మర గాలింపు లభ్యమైన బాలిక మృతదేహం

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద ఈ నెల 14న పడవ ప్రమాదంలో గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.మంగళవారం కొనసాగిన గాలింపులో పి.గన్నవరం మండలం శేరిలంక శివారు సీతారాంపురానికి చెందిన పదో తరగతి విద్యార్థిని సుంకర శ్రీజ (14) మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించారు. యానాం వద్ద అయ్యన్ననగర్‌ తీర ప్రాంతంలో దొరికిన మృతదేహానికి ఫెర్రీ వద్ద పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. . ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సహా పలు బృందాలు నిరంతరాయంగా చేస్తున్న గాలింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వారు తెలిపారు. డిజిపి ఆదేశాల మేరకు తమ శాఖ సిబ్బంది కూడా గాలింపు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పి విశాల్‌గున్నీ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*