29 వేల దిగువకు పసిడి

న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్యంగా డిమాండ్ పడిపోవడంతోపాటు దేశవ్యాప్తంగా ఆభరణాల కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించకపోవడంతో పసిడి ధర రూ.29 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర ఒకేరోజు రూ.400 తగ్గి రెండు నెలల కనిష్ఠ స్థాయి రూ.28,850కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.525 తగ్గి రూ.41 వేల దిగువకు జారుకున్నది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి సిల్వర్ ధర రూ.40,975కి చేరింది. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచనుండటంతోపాటు పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన వాటివైపు మళ్లించడంతో అతి విలువైన లోహాల ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని బులియన్ ట్రేడర్ తెలిపారు. సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 0.4 శాతం తగ్గి 1,196.24 డాలర్లకు పడిపోయింది. జనవరి 31 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*