ఈ విషయం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారం

సుప్రీంకోర్టు  లో పరిస్థితి సజావుగా లేదంటూ, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వ‌హించి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ విషయం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారమని, అందులో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
సుప్రీంకోర్టులో ఈ పరిణామం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి ముప్పు వాటిల్లేలా ఉందని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*