సరస్వతిదేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం

grand-celebration-of-navratri-at-indrakiladri

ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఈ రోజు (శనివారం) సరస్వతి దేవీ రూపంలో దర్శనమిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు భారీగా క్యూకట్టారు. ఈ రోజు లక్ష నుంచి లక్షన్నర మేరకు భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసిన అధికారులు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 4 గంటల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు దుర్గామాతకు పట్టువస్త్రాలు సమరించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*