దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోండి: గైక్వాడ్‌

దిల్లీ: ఎయిరిండియా సీనియర్‌ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మరోసారి తన చర్యను సమర్థించుకున్నారు. ఘటనపై క్షమాపణ చెప్పేది లేదని చెబుతూనే.. దమ్ముంటే తనను అరెస్ట్‌ చేసుకోండని సవాల్‌ చేశారు. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో ఎయిరిండియా సీనియర్‌ మేనేజర్‌ శివకుమార్‌ను గైక్వాడ్‌ నిన్న చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన గైక్వాడ్‌.. ‘నేను క్షమాపణ చెప్పేది లేదు. అతడే నాకు క్షమాపణ చెప్పి తీరాలి. ఎంపీలతో ఎలా ప్రవర్తించాలో 60ఏళ్ల వ్యక్తికి తెలిసి ఉండాలి. ఈ విషయంలో పోలీసులకు దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయండి. నా పార్టీ నాకు అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

కాగా.. గైక్వాడ్‌ చర్యను తీవ్రంగా ఖండించిన ఎయిరిండియా ఆయనను సంస్థ నిషేధిత జాబితాలో చేర్చింది. మరోవైపు భారత విమానయాన సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఏ) నుంచి కూడా గైక్వాడ్‌ను నిషేధించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*