సిలికానాంధ్ర వ‌ర్సిటీకి హ‌నిమిరెడ్డి భూరి విరాళం!

hanimireddy-gives-rs-6-6-crores-to-silicon-andhra-versity

అమెరికాలో స్థిర‌ప‌డ్డ ప్ర‌వాసాంధ్ర ప్ర‌ముఖుడు, అగ్ర‌రాజ్యంలో పేరుమోసిన వైద్యుడిగా పేరుగాంచిన డాక్ట‌ర్ ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి… అక్క‌డ సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీ పేరిట కొత్త‌గా ఏర్పాటు కానున్న తెలుగు వ‌ర్సిటీకి భూరి విరాళం ఇచ్చారు. కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో ఈ వ‌ర్సిటీ కోసం ఓ భారీ భ‌వంతిని అక్క‌డి తెలుగు సంఘం సిలికానాంధ్ర కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిన్న స‌ద‌రు భ‌వ‌నాన్ని సిలికానాంధ్ర ప్రారంభించింది. సిలికానాంధ్ర వ‌ర్సిటీకి ఈ భ‌వ‌న‌మే కీల‌క భ‌వ‌నంగా కొన‌సాగ‌నుంది. ఈ భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చిన డాక్ట‌ర్ ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి వ‌ర్సిటీ కోసం భూరి విరాళాన్ని అంద‌జేశారు. క్రిష్ణా జిల్లాకు చెందిన హ‌నిమిరెడ్డి చాలా కాలం క్రిత‌మే అమెరికా వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు వాస్త‌వానికి నిన్న ప్రారంభ‌మైన భ‌వ‌నానికి కూడా డాక్ట‌ర్ ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి భ‌వనంగానే పేరు పెట్టిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్సిటీలోని ప్ర‌ధాన భ‌వ‌నానికి త‌న పేరు పెట్ట‌డాన్ని స్వాగతించిన ల‌క్కిరెడ్డి హ‌నిమిరెడ్డి… వ‌ర్సిటీ కోసం త‌న‌వంతుగా రూ.6.6 కోట్ల భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. స‌ద‌రు మొత్తానికి చెందిన చెక్కును ఆయ‌న త‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి, కుమారులు విక్ర‌మ్ రెడ్డి, సిద్ధార్థ‌రెడ్డిల‌తో క‌లిసి సిలికానాంధ్ర ప్ర‌తినిధుల‌కు అంద‌జేశారు. హ‌నిమిరెడ్డి విరాళంతో ఇప్ప‌టిదాకా సిలికానాంధ్ర వ‌ర్సిటీ కోసం ప్ర‌వాసాంధ్ర ప్ర‌ముఖులు అంద‌జేసిన విరాళాల మొత్తం రూ.60 కోట్ల‌కు చేరింది. మొత్తం విరాళంలో హ‌నిమిరెడ్డి ఒక్క‌రి విరాళ‌మే ప‌ది శాతానికి పైగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో నిన్న విరాళానికి చెందిన చెక్కును అంద‌జేసిన హ‌నిమిరెడ్డి దంప‌తుల‌ను సిలికానాంధ్ర ప్ర‌తినిధులు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ వ‌ర్సిటీ త‌న కార్య‌క‌లాపాల‌ను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ప్రారంభించ‌నుంది. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడి చేత ఈ వ‌ర్సిటీని ప్రారంభింప‌జేయాల‌ని సిలికానాంధ్ర భావిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*