జయలలిత ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన జర్నలిస్ట్!

happy-news-the-state-tamil-nadu-cm-jayalalitha-recovering

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆరోగ్యం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి పైన అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమ్మ ఆరోగ్యంపై వదంతులకు తెరదించుతూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వరుస ట్వీట్లు చేశారు. జయలలిత కోలుకుంటున్నారని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని మాలిని పార్థసారథి ట్వీట్ చేశారు. జయలలితను ఆసుపత్రిలో పరామర్శించిన అత్యంత సన్నిహితులు ద్వారా ఈ శుభవార్తను తాను వెల్లడిస్తున్నట్లు చెప్పారు. జయలలిత కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, ఆమె వ్యక్తిగత నేస్తం ద్వారా తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. జయ స్పృహలోనే ఉన్నారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*