ముంబయిలో భారీ వర్షాలు

మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబయిలో వారం రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు నగరంలో వరద పరిస్థితిని తలపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ముప్పు ఏర్పడింది. నలస పొర స్టేషన్‌ వద్ద రైళ్ళలో చిక్కుకు పోయిన ప్రయాణీకులను ఎన్‌డిఆర్‌ఎప్‌ సిబ్బంది కాపాడారు. దహను-బొయిసర్‌ ప్రాంతాలకు రైళ్ళు చేరుకోవడంతో అక్కడ నుండి ప్రయాణీకులను చేరవేసేందుకు డిఆర్‌డి రెండు బస్సులు ఏర్పాటు చేసింది.ముందు జాగ్రత్త చర్యగా నగరంలోనూ, పరిసర ప్రాంతాలలోనూ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో దాదాపు 3 లక్షల మంది ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్గ మధ్యంలోనే నిలిచిపోయిన వదోదర ఎక్స్‌ప్రెస్‌ రైలులో చిక్కుకు పోయిన ప్రయాణీకులకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, కోస్టగార్డ్‌ బృందాలు తగిన సహాయాన్ని అందించాయి. స్నాక్స్‌ తదితర ఆహార పదార్ధాలను వారికి అందించారు. మధ్యాహ్న సమయానికి తుఫాను ఏర్పడనున్నదన్న వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*