కవాసాకీతో బజాజ్ తెగదెంపులు

దేశీయ వాహన త యారీ సంస్థ బజాజ్ ఆటో.. జపాన్‌కు చెందిన ఆటో కంపె నీ కవాసాకీ మధ్య దశాబ్దం క్రితం ఏర్పడిన అనుబంధానికి తెరపడనుంది. ఇండియన్ మార్కెట్లో ఇరు సంస్థల మధ్య కుదిరిన వ్యాపారపరమైన భాగస్వామ్యానికి ఏప్రిల్ 1 నుంచి తెగదెంపులు కానున్నాయని బజాజ్ ఆటో ప్రోబైకింగ్ విభాగ ప్రెసిడెంట్ అమిత్ నంది వెల్లడించారు. అయితే విదేశాల్లో మాత్రం పరస్పర సహకారం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పుణె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బజాజ్ ఆటో.. ప్రస్తుతం భారత మార్కెట్లో కేటీఎం బైకులను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ప్రొబైకింగ్ షోరూంల ద్వారా కవాసాకీ మోటార్ సైకిళ్లను విక్రయించడంతోపాటు సర్వీసింగ్ సేవలు అందిస్తున్నది.

అయితే కేటీఎంతో భాగస్వామ్యంపైనే బజాజ్ ప్రధానంగా దృష్టి పెట్టిన నేపథ్యంలోనే కవాసాకీతో విడిపోతున్నట్లు తెలుస్తున్నది. రెండు కంపెనీల మధ్య బంధం ముగిసిపోనుండటంతో వచ్చేనెల నుంచి ఇండియా కవాసాకీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కవాసాకీ బైకులను విక్రయించనున్నారు. అంతేకాదు కొత్తగా మోటార్ సైకిల్ కొనుగోలు చేసేవారితోపాటు పాత కస్టమర్లకు సైతం సర్వీసింగ్ సేవలందించనుంది. జూలై 2010లో ఏర్పాటైన ఈ సంస్థ కవాసాకీ హెవీ ఇండస్ట్రీస్ జపాన్‌కు 100 శాతం అనుబంధ విభాగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*