రిలయన్స్ జియో 4జీ సిమ్ను పొందటం ఎలా..?

how-to-get-reliance-jio-4g-sim

రిలయన్స్ జియో 4జీ ఇంటర్నెట్ సర్వీసులు, దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరినాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ సేవలు పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లు రిలయన్స్ జియో 4జీ ఎక్స్‌పీరియన్స్‌ను ముందుగా పొందే అవకాశం ఉంటుంది. రిలయన్స్ గ్రూప్ సబ్సిడరీ బ్రాండ్ అయిన రిలియన్స్ జియో ఇన్ఫోకామ్ దేశవ్యాప్తంగా 4జీ ఎల్టీఈ సేవలను అందించేందుకు పాన్ – ఇండియా లైసెన్స్‌ను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు రిలయన్స్ జియో గత కొద్ది సంవత్సరాలుగా శ్రమిస్తోంది. ఈ వెంచర్‌లో భాగంగా దాదాపు 34,000 కోట్లను రిలయన్స్ వెచ్చించినట్లు సమాచారం. ప్రస్తుతానికి రిలయన్స్ జియో 4జీ సర్వీసులు లిమిటెడ్ ప్రివ్యూలోనే అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లు మాత్రమే జియో సిమ్ కార్డ్‌లను పొందగలుగుతున్నారు. రిలయన్స్ లైఫ్ బ్రాండ్ ఫోన్‌లను కొనాలనుకునే యూజర్లు ముందుగా రిలియన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ jio.comలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతమైనట్లయితే జియో సర్వీసు నుంచి ఓ కోడ్ మీ ఈమెయిల్‌కు అందుతుంది. ఈ కోడ్ ఆధారంగా మీకు జియో సిమ్‌తో పాటు లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అందించటం జరుగుతంది. రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతానికి రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లలో లభ్యమవుతున్నాయి.ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధేశిత expiry dateతో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది. Lyf బ్రాండ్ పేరిట రిలయన్స్ అందిస్తోన్న 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు రూ.2,999 ధర ట్యాగ్ నుంచి లభ్యమవుతున్నాయి. ప్రతి ఫోన్ కొనుగోలు పై 3 నెలల రిలయన్స్ జియో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉచితంగా పొందే అవకాశాన్ని రిలయన్స్ కల్పిస్తోంది.రిలయన్స్ జియో 4జీ సిమ్ అందించే డౌన్‌లోడ్ స్పీడ్ నెట్‌వర్క్ స్థాయిని బట్టి కనిష్టంగా 8 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 18 ఎంబీపీఎస్ వరకు ఉంది. ఇదే సమయంలో మార్కెట్లోని ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తోన్న 4జీ నెట్ వర్క్ స్పీడ్స్ 6 ఎంబీపీఎస్ నుంచి 10 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడ్‌లను కలిగి ఉంటున్నాయి.

47total visits,3visits today

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*