అడవికి పోతున్నా, వచ్చాక ఫోన్ చేస్తా

iam-going-forest-conistable-abubakar

డవికి వెళ్తున్నా. నాన్నా,కూంబింగ్ కు వెళ్తున్నా,ఇప్పటికే క్యాంపుకు చేరిపోయాను. ఆపరేషన్ పూర్తయ్యాకే ఫోన్ చేస్తా…అప్పటి వరకు ఫోన్ చేసే పరిస్థితి ఉండదు…మీరు కూడ నాకు ఫోన్ చేయకండి ..నేను క్షేమంగానే వచ్చేస్తాను అంటూ ఒడిశా ఎన్ కౌంటర్ లో మరణించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబు బాకర్ తండ్రితో మాట్లాడిన చివరి మాటలు. ఒడశా ఎన్ కౌంటర్ కు రెండు రోజుల ముందు క్యాంపు నుండి గాజువాకలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే గడిపాడు. శుక్రవారం నాడు క్యాంపుకు చేరుకొన్నాడు. అదే రోజుల రాత్రి తండ్రికి పోన్ చేసి మాట్లాడాడు. అవే చివరి మాటలయ్యాయని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాత స్పూర్తితోనే అబుబాకర్ పోలీసు ఉద్యోగంలో చేరాడు.1993 వరకు ఆయన తాత ఇస్మాయిల్ కానిస్టేబుల్ గా పనిచేశారు.2011లో పోలీసు ఉద్యోగానికి ఎంపికైన అబు బాకర్ గ్రేహౌండ్స్కు వెళ్ళాడు. క్యాంపులో ఉంటే ప్రతి రోజు కుటుంబసభ్యులతో మాట్లాడేవాడుత్వరలోనే అబు బాకర్ కు పెళ్ళి చేయాలని అనుకొంటున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు.ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకొందని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. కూంబింగ్ కు ఎప్పుడు వెళ్ళినా అబు బాకర్ ముందుండేవాడని డిజిపి కొనియాడారు. అత్యంత ధైర్య సాహాసాలతో కూంబింగ్ లో ఉండేవాడని సహాచరులు గుర్తు చేసుకొన్నారు.అధికార లాంచనాలతో అబుబాకర్ అంత్యక్రియలు ముగిశాయి. అబుబాకర్ కుటుంబ సభ్యులకు 40 లక్షల రూపాయాల చెక్ ను అందించారు డిజిపి సాంబశివరావు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*