ఏపీ బడ్జెట్‌లో నిరుద్యోగులకు శుభవార్త

అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగితను తగ్గించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. 10 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం తన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఎవరూ అధైర్య పడవద్దని, అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్ర యనమల భరోసా కల్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*