మోడీని తట్టుకోలేకపోతున్న పాక్!

New Delhi:  Prime Minister Narendra Modi addresses during the inauguration of the Pravasi Bhartiya Kendra at Chanakyapuri, in New Delhi on Sunday.  PTI Photo by Kamal Singh(PTI10_2_2016_000171B)
యూరి దాడికి ప్రతిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ధీటైన చర్యలు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో గతంలో కంటే ఎక్కువగా పాక్ రెచ్చిపోతోంది. బారాముల్లాలో, ఆ వెంటనే గంటల్లో పంజాబ్ గురుదాస్‌పూర్‌లో కాల్పుల ఉల్లంఘన జరిపింది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‍‌ను మోడీ ప్రభుత్వం ఏకాకిని చేసింది. ఉగ్రవాదం విషయంలో ఆ దేశాన్ని బోనులో నిలబెట్టారు. దీనిని పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం విషయంలో పాక్‌ను ఏకాకిని చేశారు. యూరి ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐక్య రాజ్య సమితిలో పాక్‌ను ఏకాకిని చేసింది. సార్క్ సమావేశాలు రద్దయ్యేలా చేసింది. పైగా, సార్క్ దేశాలతో పాటు అమెరికా సహా అన్ని దేశాలు పాక్ వైపు ఉగ్రవాదం విషయంలో వేలెత్తి చూపించాయి. ఆ తర్వాత సర్జికల్ స్ట్రయిక్ ద్వారా పాక్‌కు షాకిచ్చింది. దీనిని సార్క్ దేశాలైన బంగ్లాదేశ్ తదితర దేశాలు సమర్థించాయి. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందని చెబుతూ సార్క్ సమావేశాలు రద్దయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక కూడా షాకిచ్చింది. అంతేకాదు, సర్జికల్ స్ట్రయిక్ దాడులను భారత్ ముందే.. అమెరికా, గల్ఫ్ దేశాలకు సమాచారం అందించిందని తెలుస్తోంది. ఇలా వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*