భారత్‌పై ఒత్తిడి, దెబ్బకు పాక్ ద్విముఖ వ్యూహం

india-pakistan-armies-exchange-more-fire-kashmir

సర్జికల్ స్ట్రయిక్ దాడికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తోందా? జమ్ము కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా భారత దేశంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు. సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ పైన పాకిస్తాన్ రెండు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ, మరోవైపు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ ఇబ్బందులు సృష్టించాలని, తద్వారా భారత్ పైన ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే ఇప్పటికి పాకిస్తాన్ ఎనిమిదిసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. మరోవైపు వరుసగా ఉగ్రవాదులు జొరబడే ప్రయత్నాలు చేస్తున్నారు. యూరి ఆర్మీ క్యాంప్ పైన, ఆదివారం బారాముల్లా ఆర్మీ క్యాంప్ పైన, తాజాగా గురువారం ఉదయం హంద్వారా క్యాంప్ పైన ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా, హంద్వారాలో సైన్యం ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఓ వైపు పీవోకేలో కాల్పులు, మరోవైపు ఉగ్రవాద దాడులతో సైన్యం దృష్టిని పాకిస్తాన్ మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, భారత్‌లో స్లీపర్ సెల్స్ పైన దృష్టి సారించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*