బుల్లెట్ తగిలి నేవీ ఆఫీసర్ మృతి

indian-navy-officer-dies-ins-kuthar-due-accidental-firing

విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. నేవల్ డాక్‌యార్డ్‌లోని ఐఎన్ఎస్ కుతార్ యుద్ధనౌకలో తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో నేవీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే… హర్యానాకు చెందిన తేజ్‌వీర్‌సింగ్‌ (25) తూర్పు నౌకాదళంలో సబ్‌ లెఫ్టినెంట్‌ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విధులు నిర్వహించే యుద్ధనౌక ఇంజన్‌ రూమ్‌ నుంచి ఒక్కసారిగా తుపాకి పేలిన శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న సహచర ఉద్యోగులకు రక్తపు మడుగులో పడి ఉన్న తేజ్‌వీర్ కనిపించారు. హుటాహుటిన ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆసుపత్రికి తరలించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*