హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు

జైష్‌-ఇ-మొహమ్మద్‌కి చెందిన 12మంది ఉగ్రవాదులు జమ్ము-కాశ్మీర్‌లోకి ప్రవేశించారని, పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున దాడులకు చేయనున్నట్లు సమాచారం అందడంతో జమ్ము కాశ్మీర్‌తో పాటు రాజధాని ప్రాంతమైన ఢిల్లీని కూడా అప్రమత్తం చేసినట్లు భద్రతా అధికారులు పేర్కొన్నారు.

పాకిస్థాన్ నుంచి పిర్ పంచల్ పర్వతాల వారు జమ్ము కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.అంతేకాదు వారందరూ మూడు గ్రూపులుగా విడిపోయి ట్రల్, సోపియన్, పుల్వామా ప్రాంతాల్లో తమ ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక మంగళవారం పుల్వామాలో 50ఆర్ ఆర్ క్యాంప్‌పై జరిగిన దాడి వెనుక వీరి హస్తం ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలిన నిఘా వర్గాలు సూచించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*