రాణించిన సాహా.. భారత్ 316 ఆలౌట్

indvsnz-india-all-out-for-316-in-first-innings-of-second-test

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 316 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 239/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ప్రారంభంలో బాగానే ఆడింది. మొదటి రోజు పరుగులేమి చేయకుండానే క్రీజులో ఉన్న జడేజా 14 పరుగులు చేసి వాగ్నర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 272 పరుగుల వద్ద టీమ్ ఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన భువనేశ్వర్ కుమార్ కూడా 5 పరుగులకే అవుటయ్యాడు. దీంతో భారత్ 281 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పదకొండో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి అడుగు పెట్టిన షమీ వృద్ధిమాన్ సాహాకు చక్కటి సహకారం అందించాడు. ధాటిగా ఆడిన సాహా సాంట్నర్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు 14 పరుగుల వద్ద ఉన్న సాహా రెండో రోజు కీలమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఒక దశలో 300 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందని భావించినప్పటికీ భారత్ 316 పరుగులు చేయగలిగింది. వేగంగా రన్స్ చేసిన షమీ 14 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. సాహా 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో హెన్రీకి మూడు వికెట్లు దక్కగా, పటేల్, వాగ్నర్, బౌల్ట్‌లకు రెండు వికెట్ల చొప్పున దక్కాయి. తొలి రోజు 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, రహానేలు అద్భుత ఆటతీరుతో ఆదుకున్న సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*