ద్వారకపై ఉగ్రదాడులు జరిగే అవకాశం: ఐబీ

intelligence-input-warns-of-terror-strike-on-dwarka-temple

పాకిస్థాన్ గూడచారి సంస్థ ఐఎస్ఐ కొంత మంది తీవ్రవాదులను దాడుల కోసం ఇండియాకు పంపినట్లు ఐబీ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా ద్వారకలోని దేవాలయంపై దాడులకు పథకం వేశారని ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. దీంతో పశ్చిమ తీర ప్రాంత నగరాలైన ద్వారక, మండల్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్‌లో భద్రతా దళాలు అప్రత్తమయ్యాయి. సుమారు 12 నుంచి 15 మంది తీవ్రవాదులు గుజరాత్ తీరానికి చేరుకున్నారని కేంద్ర నిఘా సంస్థ గుజరాత్ రాష్ర్ట డీజీపీకి సందేశం పంపింది. వారు ద్వారక లేదా మండల్‌లో శిబిరాల్లో ఉన్నట్లు కూడా సీఐ తెలిపింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వద్ద చేపల వేటాడే రెండు పడవల ద్వారా భారత ప్రాదేశిక జలాల్లోకి వీరు ప్రవేశించారని ఐబీ తెలియజేసింది. దీంతో కోస్తా తీరంలో తీర ప్రాంత గస్తీ దళం, నేవీ, మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. ఝకౌ తీరంలోని 40 నాటికల్ మెల్ వద్ద పాకిస్థాన్ సముద్ర పోలీసులు ఇండియాకు చెందిన పది చేపల వేటాడే పడవలను అపహరించారనే వదంతులు వ్యాపించాయి, కానీ ఫిషర్‌మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ మోడీ అపహరణ గురించి వార్తలను ధృవీకరించడం లేదు. గత శనివారం బీహార్‌లోని ఔరంగాబాద్‌లో జైష్-ఇ- మహ్మద్ తీవ్రవాది 44 ఏళ్ల హసన్ ఇమూముద్దీన్‌‌ను ఏటీఎస్ అరెస్టు చేసింది. కోల్‌కతాలోని అమెరికన్ కల్చరల్ సెంటర్‌పై 2002లో జరిగిన ఉగ్రదాడితో హసన్‌కు సంబంధాలు ఉన్నాయి. గుజరాత్ లేదా ఇతర పొరుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ఉనికి హసన్‌ ద్వారా తెలుసుకోడానికి అతడిని విచారిస్తున్న గుజరాత్ ఏటీఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*