పవన్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్

రాజకీయాలు, మరో వైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో ప్రాజెక్ట్ మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ తో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తుండగా ఇందులో పవన్ సాఫ్ట్ వేర్ పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రత్యేక సెట్ ని రామోజ్ ఫిలిం సిటీలో రెడీ చేస్తున్నారట. సమ్మర్ కారణంగా సెట్ మొత్తం చల్లగా ఉండేలా దానిని తయారు చేయిస్తున్నట్టు టాక్. ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్. ప్రకాష్ ఆద్వర్యంలో ఈ మూవీ సెట్ రెడీ అవుతుంది. మార్చి 25 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుండగా ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు కథానాయికలుగా నటించనున్నారు.. హారిక అండ్ హాసని బేనర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*