సరిహద్దుల్లో ఆధునిక భద్రత భారత్‌కు ఇజ్రాయెల్‌ దన్ను

పీవీ నరసింహారావు ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో 1992 జనవరిలో దౌత్య సంబంధాలు కుదుర్చుకొన్న ఏడేళ్లకే ఆ దేశంతో స్నేహం భారత్‌కు ఎంతో అక్కరకొచ్చింది. 1999 కార్గిల్‌ యుద్ధంలో ఇజ్రాయెల్‌ అందించిన డ్రోన్‌లు, క్షిపణులు, ఫిరంగిగుళ్లతో భారతదేశం, పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి పారదోలింది. ఇటీవల పాకిస్థాన్‌ వత్తాసుతో ఉగ్రవాదులు ఉరీపై దాడి చేసి భారతీయ జవాన్లను హతమార్చిన వెంటనే భారత్‌కు సాయపడేందుకు ఇజ్రాయెల్‌ హుటాహుటిన ముందుకొచ్చింది. సరిహద్దులో చొరబాట్ల నిరోధానికి ఆధునిక పరికరాలు, పరిజ్ఞానాన్ని ఇవ్వజూపింది. ఉరీ ఘటనకు ప్రతీకారంగా భారత్‌ జరిపిన లక్షిత దాడుల్లో ఇజ్రాయెలీ టేవర్‌ తుపాకులతోపాటు హెరాన్‌ డ్రోన్‌లను ఉపయోగించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో నిరంతరం చేయి చేయి కలిపి ముందుకు సాగుతున్నామని దిల్లీలో ఇజ్రాయెల్‌ రాయబారి డేనియల్‌ కార్మన్‌ వెల్లడించారు. 1965, 1971 యుద్ధాల్లోనూ ఇజ్రాయెల్‌ లోపాయికారీ సహాయం అందించినా ఆ విషయాన్ని బయటపడనివ్వలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*