ఇస్రోపై ప్రశంసల జల్లు

పీఎస్ఎల్వీ-సీ40ని విజయవంతంగా ప్రయోగించి, 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇస్రో సైంటిస్టులకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ లు అభినందనలు తెలిపారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. తనతోపాటు 31 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వీటిలో మూడు భారత ఉపగ్రహాలు కాగా, మిగిలినని విదేశాలకు చెందిన నానో ఉపగ్రహాలు. భారత ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 ఈఆర్ ఉంది. ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును ఉపగ్రహవాహక నౌక తనతో పాటు తీసుకెళుతోంది. కార్టోశాట్-2 ఉపగ్రహం బరువు 710 కిలోలు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ మూడవ దశ విజయవంతంగా ముగిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*