ఉత్సాహంగా సాగిన జగన్ యాత్ర

ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే ఆయనను కలవడానికి భారీగా తరలి వచ్చారు.అక్కడే ఓ చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు. కామాయపాలెంలో వైఎస్ జగన్‌ను పొగాకు రైతులు కలిసి మద్దతు ధర లేదని ఆవేదన చెందారు. తమ నివాసాలు కూల్చి రోడ్డును పడేశారని పైడిపర్రు నిర్వాసిత మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తణుకు చేనేత కార్మికులు వైఎస్ జగన్‌ను విన్నవించుకున్నారు. నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యల పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*