వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం జిల్లాలోకి ప్రవేశించగానే అక్కడి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు తరలిరావడంతో రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది.సాయంత్రం రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. పోలవరం డయాఫ్రంవాల్‌ అంటే పునాది గోడ అని, ఇది పూర్తయ్యిందని, జాతికి అంకితం చేస్తున్నానని సిఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 36 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరగాల్సి ఉండగా, 6 లక్షలు లేదా 7 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని మాత్రం జరిగిందన్నారు. ఇళ్లు కట్టుకునేటప్పుడు పునాది పూర్తయితే శంకుస్థాపన ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించారు. పోలవరానికి సంబంధించి ఆరుసార్లు శంకుస్థాపనలు, ఐదుసార్లు జాతికి అంకితం చేయడాలు జరిగాయని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో నాలుగేళ్లుగా అమరావతి, పోలవరం సినిమాలను ప్రజలకు తరచూ చూపిస్తున్నారని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*