కాకినాడను అవినీతిలో స్మార్ట్ గా చేశారు:

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, కాకినాడను స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి బదులు, అవినీతిలో స్మార్ట్ గా తయారు చేశారని, ఇక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, ఆయిల్ మాఫియా, డీజిల్ మాఫియాలు ఉన్నాయని, ఇక్కడ పుష్కలంగా పేకాట క్లబ్ లు ఉన్నాయని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కరప్షన్‌  ఈయన గారి పరిపాలనలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని గత రెండేళ్లలో మూడు ప్రఖ్యాత సంస్థలు.. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చ్, సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్‌.. తేల్చి చెప్పాయి అన్నారు. నాలుగేళ్లుగా కాకినాడను పట్టించుకోని వారు ఇప్పుడు స్మార్ట్‌ సిటీకోసం, డ్రైనేజీల కోసం టెండర్లు పిలుస్తున్నాం అంటూ మనందరి చెవుల్లో కాలీఫ్లవర్‌ పెడతారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనే సరికి అన్నీ గుర్తుకొస్తాయి. స్మార్ట్‌ సీటీ కింద కేంద్రం వందల కోట్లు ఇస్తే ఖర్చు చేసింది రూ.50 కోట్లు మాత్రమే. కేంద్రం ప్రకటించిన 20 స్మార్ట్‌ సిటీల్లో కాకినాడ పనితీరు చివరి స్థానంలో అంటే 20వ స్థానంలో ఉంది. ఐదేళ్లలో కాకినాడకు స్మార్ట్ సిటీ కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇవ్వాలి. కేంద్రం 400 కోట్లు ఇస్తే, బాబు 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ప్రజలు కంపులో ఉండటం స్మార్ట్ సిటీనా?’ అని ప్రశ్నించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*