నేటి వరకే జియో సభ్యత్వం

హైదరాబాద్‌: రిలయన్స్‌ జియో వార్షిక సభ్యత్వం (ప్రైమ్‌ మెంబర్‌షిప్‌) పొందేందుకు గడువు నేటి (మార్చి 31)తో ముగియనుంది. నూతన సంవత్సర ఆఫర్ల కింద జియో ఇస్తున్న అపరిమిత కాల్స్‌, రోజుకు 1 జీబీ డేటా సేవలను ఏప్రిల్‌ 1 నుంచీ కొనసాగించుకునేందుకు రూ.99 చెల్లించి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంది. ఇందువల్ల ఏడాదిపాటు అపరిమిత కాల్స్‌, డేటాను వినియోగించుకునేందుకు రెండు పథకాల కింద రీఛార్జి చేసుకునే అవకాశం లభిస్తుంది. సభ్యత్వం తీసుకోని వారికి కొత్త పథకాలను రిలయన్స్‌ జియో ప్రకటించనుంది.

ఇప్పటికే రిలయన్స్‌ జియో అత్యధిక వేగం డేటా (4జీ) సిమ్‌లను 10 కోట్ల మంది వినియోగిస్తుండగా, వీరిలో 5 కోట్ల మంది సభ్యత్వం తీసుకున్నారని సంస్థ బుధవారమే వెల్లడించిన సంగతి తెలిసిందే. గడువు సమీపించడంతో సభ్యత్వం తీసుకునేందుకు వినియోగదారులు, విక్రయశాలల వద్ద బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతటా రిలయన్స్‌ జియో కేంద్రాల వద్ద ఇదే స్థితి నెలకొంది. రద్దీ నివారించేందుకు పలు ప్రాంతాల్లో జియో తరఫున టెంట్లు వేసి మరీ రీఛార్జి చేస్తున్నారు.

మై జియో యాప్‌, జియో వెబ్‌సైట్‌లోనూ రీఛార్జి చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ లావాదేవీలు తెలిసిన వారు ఇలానే చేసుకుంటున్నారు. జియో వాలెట్‌ సంస్థ జియో మనీలో నగదు జమచేసుకుని, దానితో కనుక సభ్యత్వానికి రూ.99 చెల్లిస్తే, రూ.50 వాపసు వస్తోంది. అపరిమితి కాల్స్‌, డేటా సేవలను 28 రోజుల పాటు అందించేందుకు ఉద్దేశించిన రూ.303 రీఛార్జి కోసం, వాపసు వచ్చిన మొత్తాన్ని వాడుకోవచ్చు. ఇలా చేస్తే, జియో మనీకి మరో రూ.50 వాపసు వస్తుంది.

* అపరిమిత కాల్స్‌, 28 రోజులకు 2 జీబీ డేటా సరిపోతుందనకునే వారు రూ.149తో రీఛార్జి చేసుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*