‘రూ.200 అవినీతికే రాజీవ్ గాంధీని కోల్పోయాం’!

justice-chandrakumar-on-rajiv-murder-case

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 200 రూపాయల లంచం కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.200 లంచానికి ఆశపడ్డ ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం వల్లనే ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడికి పాల్పడగలిగిందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తే తప్ప ఫలితం ఉండదన్నారు. Powered by జాతీయ అవినీతి నిర్మూలన కౌన్సిల్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్‌పై విధంగా వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతి తీవ్రంగా పెరిగిపోతోందని, ప్రజా సమస్యలపై పోరాటంలో మీడియా కీలక పాత్ర పోషించాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*