కమ్యూనిస్టు పార్టీలు జనసేనతో పొత్తు..

విజయవాడలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో వామపక్షాల పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌తో సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మెరుగైన పాలన కోసం జనసేన. వామపక్షాలు, ఆమ్ఆద్మీ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు.”కూటమి, మహాకూటమి అనే పేర్లు మేము పెట్టలేదు.. కానీ, ఈనెల 20న విజయవాడలో ఓ అజెండా రూపొందించి పలు పార్టీలకు పంపించాం. ఆ పార్టీల్లో జనసేన, లోక్‌సత్తా, సీపీఐ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలతో పాటు పలుపార్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాంటి పార్టీలన్నింటినీ కూడగట్టి ముందుకు వెళతాం. త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తాం.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. మేమందరమూ కలిసి ముందుకు వెళతాం. ప్రాంతీయ అసమానతలు పోవాలి. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ ఇటీవల వైసీపీతో పవన్‌ కలుస్తారని అన్న తరువాత నేను పవన్‌తో మాట్లాడాను. పవన్‌ మేము రూపొందించిన అజెండా ప్రకారమే ముందుకు వెళ్లాలన్న స్పష్టతతో ఉన్నారు.ఉభయ కమ్యూనిస్టుల పార్టీలు పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలిపాయి.. జనసేనతో మేము ముందుకు వెళతాం” అని రామకృష్ణ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*