క‌డ‌ప‌ బంద్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం కడప జిల్లా బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ప్రజానీకం అంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో జిల్లా స్తంభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీబస్సులు నిలిచిపోయాయి. ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌లో భాగస్వాములయ్యాయి. ఎక్కడికక్కడ ప్రదర్శనలు, మానవహారాలు, బైక్‌ ర్యాలీలు జరిగాయి. ‘కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అన్న నినాదం మారుమ్రోగింది.  అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం కడప జిల్లా బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ప్రజానీకం అంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో జిల్లా స్తంభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీబస్సులు నిలిచిపోయాయి. ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌లో భాగస్వాములయ్యాయి. ఎక్కడికక్కడ ప్రదర్శనలు, మానవహారాలు, బైక్‌ ర్యాలీలు జరిగాయి. ‘కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అన్న నినాదం మారుమ్రోగింది. ఇదే తరహాలో ఉద్యమం కొనసాగితే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తథ్యమనే విశ్లేషణలు వినిపించాయి. ఉద్యమశ్రేణులకు సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజాద్‌బాష, శ్రీకాంత్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, ప్రత్యేకహోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుల చలసాని శ్రీనివాస్‌, ఉద్యోగుల సంఘం జెఎసి రాష్ట్ర నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరో పార్టీ రాష్ట్ర నేత పోతుల రామారావు నాయకత్వం వహించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*