ఈ నెల 20న విశాఖలో ధర్మ పోరాట దీక్ష

టీడీపీ సమన్వయ కమిటీలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ మేరకు సూచించారు. దీంతో ఈ నెల 20న విశాఖలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించబోతున్నట్లు మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. అలాగే జూన్ మొదటి వారంలో నెల్లూరులో దళిత తేజం, తెలుగుదేశం బహిరంగ సభలను నిర్వహించనున్నామని కళా పేర్కొన్నారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ఈ సమావేశాలు జరగనున్నాయని ఆయన చెప్పారు. ఇక అమరావతి వేదికగా జనవరిలో భారీ బహిరంగసభను నిర్వహించున్నామని కళా పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*