గాలి జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లి సందడి

karnataka-ex-minister-gali-stumps-with-daughter-s-big-fat-we

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో పెళ్లిసందడి మొదలైయ్యింది. తన కుమార్తె బ్రహ్మిణీ వివాహానికి ప్రముఖులను ఆహ్వానించే పనుల్లో గాలి జనార్దన్ రెడ్డి తీరికలేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి గాలి లక్ష్మి, కుమారుడు, కుమార్తె బ్రహ్మిణీ, కాబోయే అల్లుడు రాజీవ్ రెడ్డితో కలిసి వివాహా ఆహ్వాన వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. గాలి జనార్దన్ రెడ్డి వియ్యకుండు, హైదరాబాద్ కు చెందిన ప్రారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవారెడ్డి, ఆయన సతీమణి రమాదేవీ కూడా తమ కుమారుడు రాజీవ్ రెడ్డి ఆహ్వాన పత్రిక వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరువు కోరల్లో చిక్కిన అన్నదాతలు తమ కుమార్తెల పెళ్లిళ్లు చేయడం కష్టం అయిన తరుణంలో ఎందరో అమ్మాయిల తల్లిదండ్రుల ఆవేదన గుర్తించిన గాలి సోదరులు ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 38 వేల ఉచిత సామూహిక వివాహాలు చేశారు. ఇప్పుడు గాలి తన సొంత కుమార్తె బ్రహ్మిణీ వివాహాన్ని ఎంత వైభవంగా చేస్తారో అంటూ ఎవరికితోచినట్లు వారు ఊహించుకుంటున్నారు. నవంబర్ 10వ తేదిన బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో పెళ్లికి సంబంధించిన కార్యక్రమం మొదలు కానుందని సమాచారం. నవంబర్ 16న బెంగళూరు నగరంలోని ప్యాలెస్స్ గ్రౌండ్స్ లో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె గాలి బ్రహ్మిణి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. గాలి ఇంట్లో జరిగే శుభకార్యానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శ్యాండిల్ వుడ్ తారలు హాజరుకానున్నారని సమాచారం. అదే విధంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, పలు పార్టీల రాజకీయ ప్రముఖులు, మాజీ సీఎంలు, ఎంపీలు, శాసన సభ్యులు గాలి ఇంట జరిగే శుభకార్యంలో పాల్గొంటారని తెలిసింది. అక్రమ మైనింగ్ వ్యాపారం చేశారని ఆరోపిస్తూ గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. మూడు సంవత్సరాలు జైల్లో ఉన్న గాలి గత సంవత్సరం బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు, సన్నిహితులకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కుమార్తె పెళ్లి సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి నేరుగా ప్రజల మధ్యకు రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*