అపర భగీరథుడిలా తుమ్మల కష్టపడ్డారు…

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి చేసిన తీరు ఆదర్శనీయమని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతిసభలో ఆయన మాట్లాడుతూ, ‘అపర భగీరథుడిలా కష్టపడి 10 నెలల్లో ప్రజలకు నీరు ఇచ్చారు. ఆ క్రెడిట్ నాది కాదు..పూర్తిగా తుమ్మలదే’ అని ప్రశంసించారు.

కాగా, సూర్యాపేట జిల్లాలో ఈ రోజు పర్యటించిన కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్, పోలీస్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపనలు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*