గుత్తాకు కోమటిరెడ్డి కౌంటర్

komatireddy-counter-to-gutta

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు. 2004లో తన పైన ఓడిపోయిన గుత్తా తననే సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుత్తాకు దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. గుత్తాది పూటకు ఓ మాట, ఓ పార్టీ మారే నైజం అని ఎద్దేవా చేశారు. గుత్తాకు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి తన పైన పోటీ చేయాలని అన్నారు. గుత్తాలా పార్టీలు మారే వైఖరి తనది కాదన్నారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తాను రాజీనామా చేసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. ఆయనతో పాటు పార్టీ మారిన మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని చెప్పారు. అప్పుడు ఎవరి బలం ఏమిటో చూసుకుందామన్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తాను కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం నాడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్‌పై మతి భ్రమించినట్టు కోమటిరెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*