20కోట్ల భూమిని 2కోట్లకే ఇచ్చేశారా!

land-grabbing-allegations-on-trs-mla-puvvada-ajay

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చెంతకు చేరిన ఖమ్మం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పై ఓ ఆసక్తికర కథనం వినిపిస్తోంది. దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు ఆయనకు కేవలం రూ.2కోట్లకే కట్టబెట్టారన్నది ఆ కథనం సారాంశం. తొలుత ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఆ భూమిలో కొంతమేర కబ్జా చేయగా.. తాజాగా అదే భూమిని అధికారికంగా కట్టబెట్టారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా, గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన స్థలాన్ని ఇప్పుడు అజయ్ కుమార్ కు ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకో లేక బడుగు వర్గాల ప్రజల కోసమో వినియోగించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు చెందిన మమతా విద్యా సంస్థలు ఈ స్థలాన్ని ఆనుకుని ఉండడంతో.. అందులో కొంతమేర కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*