హైదరాబాదుకు ఎపి ఉద్యోగుల తుది వీడ్కోలు

last-working-day-ap-staff-hyderabad

రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదుతో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల బంధం తెగిపోయినట్లే. హైదరాబాదు సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్‌కు తుది వీడ్కోలు చెప్పినట్లే. శుక్రవారంనాడే హైదరాబాదులో వారి చివరి పనిదినంగా మారింది. శనివారం, ఆదివారం విరామం తర్వాత సోమవారం (అక్టోబరు 3) నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే వారు పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని సచివాలయానికి భావోద్వేగంతో కూడిన వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు శాఖలు హైదరాబాద్‌ నుంచి వెలగపూడికి మారాయి. రెవెన్యూ సహా మరికొన్ని శాఖలు శుక్రవారంనాడు హైదరాబాదు కార్యాలయంలో పనులు ముగించుకుని వెలగపూడికి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఏపీకి సంబంధించి వివిధ విభాగాల అధిపతుల (హెచ్‌వోడీ) కార్యాలయాలు కూడా ఇప్పటికే తరలిపోయాయి. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఉన్న కొన్ని డైరెక్టరేట్‌లు మూడు నాలుగు రోజుల్లో విజయవాడకు చేరుకుంటాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*